గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

గుజరాత్‍ ముఖ్యమంత్రి విజయ్‍ రూపానీ తన పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‍ ఆచార్య దేవవ్రత్‍కు తన రాజీనామా లేఖను సమర్పించారు. విజయ్‍ రూపానీ 2016, ఆగస్టు 7 నుంచి గుజరాత్‍ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు ఉండగా విజయ్‍ రూపానీ రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తుంటే.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. విజయ్‍ రూపానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు.

మరో ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, విజయ్‍ రూపానీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం బీజేపీ అధిష్టానం నాయకత్వ మార్పుకు ఆదేశించినట్లు సమాచారం. దానిలో భాగంగానే విజయ్‍ రూపానీ రాజీనామా చేశారు. పటేల్‍ సామాజిక వర్గం నుంచే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్‍ పటేల్‍, సీఆర్‍ పటేల్‍, ఆర్‍సీ ఫాల్దూ ఉన్నట్లు తెలుస్తోంది. ఏబీవీపీ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. రూపానీ 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

 

Tags :