తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు... వారికి తుపాకీతోనే

తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు... వారికి తుపాకీతోనే

ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎస్‌ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు అనే అంశంపై మాట్లాడారు. 2018 నవంబర్‌ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని అన్నారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ధ విమనాలు పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

 

Tags :