దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని : జీవీఎల్

దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని : జీవీఎల్

కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్‌లో ఏం ఉద్దరించారని నిలదీశారు. విశాఖలో భూ కబ్జాలపై చర్చకు సిద్ధమా అని అడిగారు. దమ్ముంటే తన సవాల్‌ ను  స్వీకరించాలని చెప్పారు. మంత్రి ధర్మానకు, చంద్రబాబుకు ఏం లాలూచీ కుదిరిందో  చెప్పాలన్నారు. వైసీపీ, టీడీపీ నేతలు భూములు దోచుకున్నారని మండిపడ్డారు. సిట్‌ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని  ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ చేతకానితనం బయటపడిరదన్నారు. నీటి పారుదల అంశంపై చర్చకు వైసీపీ, టీడీపీ సిద్ధమా అని ప్రశ్నించారు.

 

Tags :