పారాచూట్ అడ్వాన్స్ డ్ ఆయుర్వేదిక్ కోకోనట్ హెయిర్ ఆయిల్ తో కలసి స్థానిక డిజిటల్ ఇన్ ఫ్లుయెన్సర్ల కోసం హైదరాబాద్ లో విద్యాత్మక సదస్సు నిర్వహించిన శిరోజ సంరక్షణ నిపుణులు

పారాచూట్ అడ్వాన్స్ డ్ ఆయుర్వేదిక్ కోకోనట్ హెయిర్ ఆయిల్ తో కలసి స్థానిక డిజిటల్ ఇన్ ఫ్లుయెన్సర్ల కోసం హైదరాబాద్ లో విద్యాత్మక సదస్సు నిర్వహించిన శిరోజ సంరక్షణ నిపుణులు

బేగంపేట లోని వివంటా హైదరాబాద్ లో ఈ శనివారం నాడు ఒక విద్యాత్మక సదస్సు నిర్వహణకు గాను హెయిర్ ఫాల్ విభాగంలో నెం.1 బ్రాండ్ అయిన పారాచూట్ అడ్వాన్స్ డ్ ఆయు ర్వేదిక్ కోకోనట్ హెయిర్ ఆయిల్ విశ్వసనీయ స్థానిక, జాతీయ శిరోజ సంరక్షణ నిపుణులతో చేతులు క లిపింది. పోషణ అనేది ఈ బ్రాండ్ మూలస్తంభాల్లో ఒకటిగా ఉంది. మరింత తీవ్రం కాకముందే, వెంట్రుకలు రా లిపోయే సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమంగా వారు ఏం చేయవచ్చనే విషయంలో వినియోగదారు లకు అవగాహన కల్పించేందుకు గాను ఈ బ్రాండ్ ఇన్ ఫ్లుయెన్సర్ల సారథ్యంలో ఒక క్యాంపెయిన్ చేపట్టింది.

హైదరాబాద్ లోని ఎంపిక చేసిన ప్రముఖ డిజిటల్ ఇన్ ఫ్లుయెన్సర్లతో కూడిన సమూహంతో జరిగిన ఆలో చనలు రేకెత్తించే ఈ కార్యక్రమానికి  ప్రముఖ టీవీ యాంకర్ నడియా హకానీ హోస్ట్ గా వ్యవహరించారు. వెం ట్రుకలు రాలిపోవడానికి సంబంధించిన 7 ముందస్తు సంకేతాల గురించి, ఆ సమస్య పరిష్కారంపై నిపుణు లు,  ఇన్ ఫ్లుయెన్సర్లు చర్చించారు. డెర్మటాలజిస్టు, స్కిన్, హెయిర్, నెయిల్స్ స్పెషలిస్టు డాక్టర్ టాన్యా దూబే (ఎంబీబీఎస్, డీడీవీఎల్), హైదరాబాద్ నల్లగండ్ల లోని సిటిజెన్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ట్రైకోలజిస్ట్, కాస్మటాలజిస్ట్  డాక్టర్ షాలిని పటోడియా (ఎంబీబీఎస్, డీడీవీఎల్, డీఎన్బీ, ఎఫ్ఏజీఈ), వర్ష బానూర్ (మాస్టర్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్), మారికో ఇండియా లిమిటెడ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ శాంతనమ్ (ఎండీ, డీఎన్బీ) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

డెర్మటాలజిస్టు, స్కిన్, హెయిర్, నెయిల్స్ స్పెషలిస్టు డాక్టర్ టాన్యా దూబే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మీ శిరోజ, చర్మ ఆరోగ్యం అనేది మొత్తం మీద మీ ఆరోగ్యాన్ని ప్రతిఫలించే చక్కటి సూచిక. మనం పీల్చే గా లి నుంచి తీసుకునే ఆహారం దాకా, మన జీవితాలు మన పూర్వీకులతో పోలిస్తే ఎంతో విభిన్నంగా ఉన్నాయి. అదే విధంగా మన శిరోజ ఆరోగ్యం కూడా. దానికి తోడుగా ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగాలు, స్క్రీన్ చూసే సమయం అధికం కావడం, నిద్రించే వేళలు క్రమపద్ధతిలో లేకపోవడం, అనారోగ్యదాయక ఆహారపుటలవా ట్లు వంటి వన్నీ కూడా మన శిరోజాల ఆరోగ్యంపై ప్రభావం కనబరుస్తున్నాయి. హైదరాబాద్ లో ఎంతో మంది రోగులు రఫ్ నెస్, జట్టు పలుచన కావడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవడాన్ని నేను గమనించాను. ఒక స్థాయికి మించి శుద్ధి చేసిన నీళ్లు అపార్ట్ మెంట్లకు సరఫరా కావడం కూడా ఇందుకు ఓ ప్రధాన కారణంగా ఉంటోంది. ఇలాంటి అంశాలను నియంత్రించడం అనేది మన చేతుల్లో లేదు, మనం చేయ గలిగింది ఏమిటంటే, చక్కగా నిద్రపోవడం, ఆరోగ్యదాయక ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా శిరోజాలకు నూనె పెట్టుకోవడం మాత్రమే’’ అని అన్నారు.

తీసుకునే ఆహారం దృష్ట్యా ఈ అంశం గురించి న్యూట్రిషన్, ఫిట్ నెస్ లో నాలుగేళ్ల అనుభవం కలిగిన వర్ష బానూర్ (మాస్టర్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్, మణిపాల్ యూనివర్సిటీ) మాట్లాడుతూ, ‘‘శిరోజాల ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఏటా శిరోజాలు 6 అంగుళాల దాకా పెరుగుతాయి. మీ శిరోజాలను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన కారకాలు ఉన్నాయి. అవేంటంటే: జన్యువులు, వయస్సు, హార్మోన్లు, పోషక లోపాలు, వెలుపలి అంశాలు, ఇంకా మరెన్నో. మీరు ఏం తింటున్నారనేది కూడా ఈ అంశాల్లో ఒకటి, మీ వెంట్రుకలు కనిపించే తీరును దీనితో మీరు నియంత్రించుకోవచ్చు. విటమిన్ ఎ, సి, డి, ఇ, జింక్, బి విటమిన్లు, ఐరన్, బయోటిన్, ప్రొటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లతో సహా సరైన పోషకాలను తీసుకోకపోవడం అనేది మీ శిరోజాల పెరుగుదలను నెమ్మదించేలా చేయవచ్చు, శిరోజాలు చిట్లి పోయేందుకు కారణం కావచ్చు, అవి డల్ నెస్ గా, రఫ్ నెస్ తో కనిపించేలా చేయవచ్చు, వెంట్రుకలు రాలి పోయేందుకు కూడా కారణం కావచ్చు. మన ప్రస్తుత జీవన శైలి నేపథ్యంలో మనం మన శిరోజాలు, ఆరోగ్యం గురించి మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతీ ఒక్కరూ పోషక సంపన్న ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా శిరోజాలకు పోషణ అందించాలి’’ అని అన్నారు.

పారాచూట్ అడ్వాన్స్ డ్  కన్సల్టింగ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ శాంతనమ్ (ఎండీ, డీఎన్బీ) ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘వెంట్రుకలు రాలిపోవడానికి సంబంధించి 7 ముందస్తు సూచనలు ఉన్నాయి. చాలా వరకు మనం వాటిని గమనించం. అవి భారీ స్థాయిలో నష్టం కలిగిస్తాయని మనం ఊహించం. ఎందుకంటే అవి చాలా మంది మహిళల్లో ఆ లక్షణాలు కనిపించడమే ఇందుకు కారణం. అందుకే హెచ్చరికల సంకేతాలుగా ఆ 7 సమస్యల గురించి తెలుసుకొని, భవిష్యత్ లో వెంట్రుకలు రాలిపోయేందుకు కారణమయ్యే ఆ సమస్యల ను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అవేటంటే: రఫ్ నెస్, డల్ నెస్, పలుచన కావడం, బ్రేకేజ్, చుం డ్రు, వెంట్రుకల కొనలు చిట్లిపోవడం, వెంట్రుకలు చిక్కులు పడడం. ఇప్పుడు ఈ 7 ముందస్తు సంకేతాలు మీకు తెలిశాయి, ఈ సంకేతాలన్నింటినీ ఎదుర్కొనే వన్ స్టాప్ సొల్యూషన్ ఒకటుంది. వెంట్రుకలు రాలిపోయే అంశానికి వస్తే, దాన్ని ఎదుర్కొనేందుకు కొబ్బరినూనెను మించింది మరొకటి లేదనే విషయం ఏళ్లుగా మ నకు తెలిసిందే.  మరే ఇతర శిరోజ నూనెతో పోల్చినా, ఇది పది రెట్లు మరింత లోతుగా మాడులోకి చొచ్చుకు పోతుంది. ఎంతో లోతు నుంచి శిరోజాలకు పోషణను అందిస్తుంది. ఆరంభ సంకేతాలను అడ్డుకునేలా మీ శిరోజాలకు దీర్ఘకాలిక సంరక్షణను మెరుగుపరిచేందుకు గాను ఉసిరి, హెన్నా, మెంతులు, కరివేపాకు, క లోంజి, తులసి వంటి ఆయుర్వేద దినుసులతో శక్తివంతమైన కొబ్బరి ఆధారిత నూనెను ఎంచుకోవాలి. ఈ ఆయుర్వేద దినుసులన్నింటినీ కలిగి ఉండే కొబ్బరి ఆధారిత నూనె మీ శిరోజాలను మూలం నుంచి పటిష్ఠం చేయడం మాత్రమే గాకుండా, వెంట్రుకలు రాలిపోయే సమస్యకు కూడా మీకు పరిష్కారాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

ఈ సందర్భంగా ఈ బ్రాండ్ తన నూతన ఉత్పాదన ప్యాకేజింగ్ ను నూతన బ్రాండ్ సందేశంతో ఆవిష్కరించింది.

ఈ కార్యక్రమం గురించి మారికో లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ కోషి జార్జ్ మాట్లాడుతూ, ‘‘నేడు విని యోగదారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన శిరోజ సమస్యల్లో వెంట్రుకలు రాలిపోవడం ఒకటి. ఎన్నో ఏళ్లుగా మారికో శిరోజాలపై విస్తృత అధ్యయనాలు నిర్వహిస్తోంది. హెయిర్ బ్రేకేజ్ ఎలా చోటు చేసుకుంటుందనే విష యాన్ని, దాన్ని ఎలా నియంత్రించవచ్చు అనే అంశాన్ని అది బాగా అర్థం చేసుకుంది. వినియోగదారులు గ నుక శిరోజాలకు జరుగుతున్న నష్టాన్ని సత్వరమే గుర్తిస్తే వెంట్రుకలు రాలిపోవడాన్ని గణనీయంగా తగ్గించ వచ్చు. దక్షిణ భారతదేశంలో హెయిర్ ఫాలింగ్ విభాగంలో నెంబర్ 1 బ్రాండ్ గా మేం, సమస్య ముదిరి పోక ముందే, వెంట్రుకలు రాలిపోవడాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించ దలిచాం. అందుకే ముందస్తు నివారణ లోకి ప్రవేశించాం మరియు నూతన పారాచూట్ అడ్వాన్స్ డ్ ఆయుర్వేదిక్  కొబ్బరి నూనెను రూపొందించాం. ఇది వెంట్రుకలు రాలిపోవడానికి దారి తీసే 7 ముందస్తు సం కేతాలపై పని చేస్తుంది. ఇది వెంట్రుకలు రాలిపోవడాన్ని నియంత్రించే  కొబ్బరి మరియు 25 ఆయుర్వేద మూలికల మంచితనంతో కూడుకొని ఉంటుంది. జుట్టును ఆరోగ్యదాయకం ఉంచుతుంది, దానికి చక్కటి పోషణను అందిస్తుంది’’ అని అన్నారు.

హాజరైన డిజిటల్ ఇన్ ఫ్లుయెన్సర్లలో శ్రీమాయి రెడ్డి, హాసిని రెడ్డి, శివాంగి విజయ్ వర్గీయ ఖురానా, భావనా రావ్, ఆకాంక్ష కొమిరెల్లి, సౌక్య రెడ్డి, లక్ష్మి రెడ్డి, మీనాక్షి పమ్నాని డీబీ, పరిది గులాటి, కీర్తనా రెడ్డి, అక్షయ బోడపాటి, అలకనంద బోడపాటి, శ్రేయరావు కామవరపు, తుశిత డేక ఉన్నారు. వెంట్రుకలు రాలిపోవడానికి సంబంధించి 7 ముందస్తు సంకేతాలపై మరియు వాటిని ఎదుర్కోవడంపై అవగాహనను ఏర్పరిచే సోషల్ మీడియా క్యాంపెయిన్ లో వీరు భాగంగా ఉంటారు.

ఈ కార్యక్రమం ఇన్ ఫ్లుయెన్సర్లకు చక్కటి ఎంగేజింగ్ సెషన్ గా ఉంది. వెంట్రుకలు రాలిపోవడానికి సంబంధిం చి 7 ముందస్తు సంకేతాలపై మరియు వాటిని ఎదుర్కోవడంపై అవగాహనను ఏర్పరిచేలా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వినోదభరిత గేమ్స్ ఆడారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రశ్నలకు నిపుణులు సమాధానమిచ్చారు. ఫన్ ఫోటో సెషన్, తేనీటి విందుతో కార్యక్రమం ముగిసింది. 

 

 

Tags :