ఫాస్ట్‌ గ్రోయింగ్‌ కంపెనీగా హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌

ఫాస్ట్‌ గ్రోయింగ్‌ కంపెనీగా హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌

అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటిగా హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ నిలిచింది. ది ఇంక్‌ 5000 కంపెనీల్లో వేగంగా అభివృద్ధి కనబరుస్తూ హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌  ప్రైవేట్‌ కంపెనీల వార్షిక జాబితాలో గతంలోకన్నా తన ర్యాంక్‌ను బాగా మెరుగుపరుచుకుంది. ప్రముఖ హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీగా ఎదిగిన హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ స్టార్టప్‌ సంస్థగా ప్రారంభమై నేడు ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిందని, దీని ప్రధాన క్లౌడ్‌ ఆధారిత ఉత్పత్తులు ఐన్‌స్టీన్‌, వర్క్‌ఫోర్స్‌ మేనెజ్‌మెంట్‌ ఇతర ఆరోగ్య సంరక్షణ పద్ధతులు కంపెనీ ర్యాంక్‌ మెరుగుకు దోహదపడ్డాయని హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ ప్రెసిడెంట్‌, సిఐఓ ఐజాక్‌ ఉల్లటిల్‌ పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్తుకు మేము తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో తాము దూసుకువెళుతున్నామని చెప్పారు. 

న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న హాల్‌మార్క్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌లో అనుభవం ఉన్న కార్యనిర్వాహక బృందం, ఉద్యోగులు కంపెనీ ఎదుగుదలకు నిర్విరామంగా కృషి చేయడం వల్ల నేడు కంపెనీ ఉన్నతంగా ఎదుగుతోంది. 

హాల్‌మార్క్‌ గ్రూపు ఆఫ్‌ కంపెనీస్‌కు చైర్మన్‌ గా ఉన్న జయ్‌ తాళ్ళూరి అటు బిజినెస్‌లోనూ, ఇటు కమ్యూనిటీ సేవలోను రాణిస్తూ కంపెనీని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు కమ్యూనిటీకి అవసరమైన సేవా కార్యక్రమాలను చేయడంతోపాటు తానా అధ్యక్షునిగా నిన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమందికి సహాయాన్ని అందించారు. 

 

Tags :