మట్టిగణపతినే ఫూజించండి

మట్టిగణపతినే ఫూజించండి

వినాయకచవితి సందర్భంగా ప్రజలంతా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి గణపతినే పూజించాలంటూ మంత్రి హరీష్‍రావు పిలుపువినాయక చవితి సందర్భంగా   తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్‍ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‍రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామన్నారు. అన్ని విఘ్నాలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి ఆయన ప్రార్ధించారు. కరోనా మహమ్మారి అనే విఘ్నం తొలగాలని కోరుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం మట్టి గణపతి ప్రతిమలను ప్రతిషి‘ంచుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించుకోవాలని హరీష్‍రావు సూచించారు.  

 

Tags :