మోదీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం : మంత్రి హరీశ్‌రావు

మోదీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం : మంత్రి  హరీశ్‌రావు

ప్రధాని మోదీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జవాన్లకు ఉన్న గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  అగ్నిపథ్‌ తెచ్చి యువతను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. మోదీ పాలనలో డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమని అన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రైతుల గౌరవం, భూముల ధరలు పెరిగాయన్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో సాగుకు గిరాకీ పెరిగిందన్నారు. 

మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. ఆర్మీలోనూ కాంట్రాక్టు ఉద్యోగాల పద్ధతిని ప్రధాని మోదీ తెచ్చారని విమర్శించారు. ఆర్మీలో నాలుగేళ్లు పని చేసిన తర్వాత యువత ఎక్కడి వెళ్లాలని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వారికి ఉద్యోగ భద్రత పింఛను ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.

 

Tags :