బీజేపీది డబుల్ ఇంజన్ కాదు... ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వం

బీజేపీది డబుల్ ఇంజన్ కాదు... ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వం

బీజేపీది డబుల్‌ ఇంజన్‌ కాదు ట్రబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అని  తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. మంథనిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని  మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వైద్యం అందట్లేదని అన్నారు. అగ్నిపథ్‌ పథకంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. సికింద్రాబాద్‌ ఘటన కేసీఆర్‌ చేయించారని బీజేపీ నేతలు అంటున్నారని, మరి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్‌ స్టేషన్‌ తగులబెట్టారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అని ప్రశ్నించారు.

 

Tags :