తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గణేష్‌ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతేడాది కూడా నిమజ్జనం పై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ వేసిన రివ్వూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్‌ఎంసీ అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించింది. గణేష్‌ నిమ్మజ్జనంపై ఓ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా వినాయక నిమజ్ఞనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్వూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పున పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్‌ సాగర్‌, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల నిమజ్ఞనంపై నిషేదం ఎత్తేయాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది.  హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్‌ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తరావ్త 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

Tags :