MKOne Telugu Times Youtube Channel

అమెరికాలో ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం

అమెరికాలో ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్‌ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్‌ సుబ్రమణియన్‌ (32)ను ఓ కారు రెడ్‌ సిగ్నల్‌ను జంప్‌ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మరియప్పన్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో టెస్ట్‌ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్‌ ఈ మధ్యనే జాక్సన్‌విల్లే నుంచి తాంపాకు వచ్చారు. మరియప్పన్‌ కుటుంబానికి సహాయం అందించేందుకు గో ఫండ్‌ మీ అనే పేజీ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ చేపట్టారు. అలాగే తంపా, జాక్సన్‌విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్‌  సభ్యులు మరియప్పన్‌ మృత దేహాన్ని భారత్‌లోని కుటంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

 

Tags :