ప్రతి ఒక్క మహిళా చూడవలసిన చిత్రం 'కమిట్ మెంట్' : హీరో అభయ్ సింహా రెడ్డి

ప్రతి ఒక్క మహిళా చూడవలసిన చిత్రం 'కమిట్ మెంట్' :  హీరో అభయ్ సింహా రెడ్డి

"క్రష్" సినిమాతో  హీరోగా రంగ ప్రవేశం చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు అభయ్ సింహా రెడ్డి. తాజాగా టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్ర‌స్టింగ్ మూవీలోని క్యూట్ లవ్ స్టోరీ కథలో యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కమిట్ మెంట్". రచన మీడియా వర్క్స్ సమర్పణ లో, ఎఫ్ 3  ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీ నటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో  బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే  రిలీజైన ఈ సినిమా టీజ‌ర్,  సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన అభయ్ సింహా రెడ్డి  పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. 

* నటుడు, నిర్మాత, దర్శకుడైన మా నాన్న సతీష్ రెడ్డి గారు గోవా, ఓ ప్రియతమా, దాదాగిరి, ప్రేమ ఎక్కడ నీ చిరునామా వంటి మూవీస్ చేశాడు. తనకు సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ చూసి పెరిగిన నాకు మా డాడీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ కి రావడం జరిగింది.  

*నా ఫస్ట్ మూవీ షూట్ "కమిట్ మెంట్" అయినా ఈ సినిమా తర్వాత  రవిబాబు గారి దర్శకత్వంలో చేసిన క్రష్ సినిమా ముందు రిలీజ్ అయ్యింది.ఆ సినిమాకి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ "కమిట్ మెంట్" సినిమా కోసం నటీ నటులు క్రూ చాలా కష్టపడ్డారు. అయితే  ఈ సినిమా కోవిడ్ వలన  నిర్మాతలు చాలా కష్టపడ్డారు. అందుకే డిలే అయ్యి ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ లలో విడుదల అవుతుంది. 

*ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా పోస్టర్ చూస్తే ఒకలా ఉంటుంది. సినిమా చూస్తే మరోలా ఉంటుంది.ఇందులో ఉన్న నాలుగు స్టోరీస్ లలో నాది క్యూట్ లవ్ స్టోరీ. ప్రజెంట్ యూత్ ఎలా వుంటున్నారు వారికీ ఎలాంటి ప్రాబ్లెమ్ వస్తాయి, వాటిని ఎలా ఓవర్ కమ్ అవుతారు అనేది ఇందులో చూయించాము. రిలేషన్ షిప్ లో ఉన్న వారు కావచ్చు, స్టూడెంట్స్ ఇలా యూత్ అందరూ ఈ సినిమాకు అట్రాక్టు అవుతారు. ఇంకొకటి రాయలసీమ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడ రఫ్ నెస్ తో ఒక స్టోరీ,ఇంకోటి మూవీ ఇండస్ట్రీ పై ఒక స్టోరీ, ఇంకోటి డాక్టర్ ఫీల్డ్ లో ఒక స్టోరీ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది చుపించాము. ప్రాబ్లమ్ అనేది ఒక్క దగ్గరే కాదు ప్రతి చోటా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. వాటిని ఓవర్ కమ్ చేసుకోవాలని ప్రతి చూపించడం జరిగింది. కాబట్టి. ప్రతి ఒక్క గర్ల్ కు ఉమెన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఉమెన్ చూడవలసిన చిత్రమిది.పోస్టర్స్ చూసి అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది. అనుకుంటారు.కానీ ఈ సినిమా చూసిన ప్రతి  ఒక్క లేడీస్ కు కచ్చితంగా నచ్చుతుంది.

*బూతు సినిమాకు మంచి సినిమాలకు  తేడా అనేది ఏముండదు  ఇక్కడ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఇందులో బోల్డ్ సీన్స్ వున్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రాపర్ గా రియలిస్టిక్ గా తీయడం జరిగింది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు వేరే ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో ఆడవాళ్లు ఎలాంటి ప్రాబ్లెమ్స్  ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చూయించడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ చూడవచ్చు.

*ఈ సినిమాలో డైలాగ్స్ మా ఫ్రెండ్స్ తో జోవియల్ గా ఎలా మాట్లాడతామో ఇందులో అలాగే ఉంటుంది. డైలాగ్స్ కు అందరూ ప్రాపర్ గా కనెక్ట్ అవుతారు.చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ గానీ, ప్రతి ఒక్క యంగ్ స్టర్ గానీ ప్రాపర్ గా రిలేషన్ షిప్ లో ఉన్న వారు కానీ ఇలా అందరికీ నా స్టోరీ  కనెక్ట్ అవుతుంది.

*షూట్ కంప్లీట్ అయిన తరువాత చూసుకుంటే మా కెమెరామెన్ సతీష్  సర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. నరేష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్ చాలా బాగుంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు.

*నాకు అన్ని జోనర్స్ ఉండే సినిమాలు చేయాలని ఉన్నా నాకు యాక్షన్ కామెడీ రొమాన్స్ ఉన్న సినిమాలు చేయడం ఇష్టం.

*నెక్స్ట్ మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బి. వి. యస్ రవి నిర్మిస్తున్న హిందీ వెబ్ సిరీస్ "సర్వం శక్తిమయం" లో నటిస్తున్నాను. ఇందులో ప్రియమణి, సంజయ్ సూరి, సమీర్ సోని, అస్లేయ సూరి వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఆ తరువాత యాక్షన్ డ్రామా రోమియో సినిమాలు చేస్తున్నాను.  అని ముగించారు.

 

Tags :