హీరో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నయా లుక్

హీరో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నయా లుక్

ఇస్మార్ట్ శంక‌ర్‌లో గ‌డ్డం పెంచి ర‌గ్డ్ లుక్‌తో క‌నిపించిన రామ్..రెడ్‌లో అదే లుక్‌ను మెయిన్ టెయిన్ చేశాడు. అయితే ఇప్పుడు చేస్తున్న లింగుస్వామి సినిమా కోసం కూడా అదే లుక్‌ను మెయిన్‌టెయిన్ చేస్తుండ‌టం విశేషం.  రామ్, లింగుస్వామి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ముప్పై రోజుల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుందీ చిత్రం. తదుపరి షెడ్యూల్ కోసం రామ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. దాని కోసం రామ్ మాస్ లుక్‌లో సిద్ధ‌మ‌వుతున్నాడు. రొటీన్ క‌థ‌లు కాకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే హీరోల్లో రామ్ పోతినేని ఒక‌డు. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోగానే, రూట్ మార్చి రెడ్ అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేయ‌డ‌మే అందుకొక సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చూపిస్తు డైరెక్ట‌ర్ లింగుస్వామితో తెలుగు, త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముప్పై రోజుల పాటు జ‌రిగిన తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రామ్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు.

అలాగే ఇస్మార్ట్ శంక‌ర్‌లో సిక్స్ ప్యాక్ పెంచి మాస్ జ‌నాల‌తో ఈల‌లు వేయించుకున్న రామ్‌..రెడ్ విష‌యంలో కామ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ లింగుస్వామి సినిమా కోసం మాసీగా బీస్ట్‌లుక్‌తో ఇస్మార్ట్ శంక‌ర్‌ను మించేలా క‌నిపించ‌బోతున్నాడు. ఈ రాపో 19 మూవీ..సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌నుంది. ఇది వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని స‌రికొత్త పాత్ర‌లో రామ్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ వుతున్నాయి. రామ్ లుక్ ఇదేనంటూ వార్త‌లు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ ఈ సినిమాలో రామ్ చేస్తున్న పాత్ర ఏంటో తెలుసా..పోలీస్ ఆఫీస‌ర్‌. మ‌రి మ‌న హీరో అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా మెప్పిస్తాడా? లేక ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా క‌నిపిస్తాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Tags :