చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ ?

చంద్రబాబుపై హీరో విశాల్  పోటీ ?

హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది. ఆయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై విశాల్‌తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. తెలుగు కుటుంబానికి చెందిన విశాల్‌ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన పరిచయమే. ఆయన తండ్రి జీకె రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త, కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్‌ గనులు, పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి.  ఇలా కుప్పం ప్రాంతంలో విశాల్‌ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను చంద్రబాబుపై పోటీకి నిలపాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోటలాగా ఉంది. ఆయనకు దీటైన అభ్యర్థి కోసం ప్రత్యర్థి పార్టీలు ప్రతిసారీ అన్వేసిష్తూనే ఉంటాయి.  సరైన అభ్యర్థి దొరక్క ప్రతి ఎన్నికలో కొత్త అభ్యర్థిని నిలుపుతున్నాయి.  కుప్పం నియోజకవర్గంలో తమిళ ప్రభావం ఎక్కువ.  అదే సమయంలో ఆయన కుటుంబానికి పారిశ్రామిక అనుబంధం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్లు తెలిసింది.

 

Tags :