ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీనియర్‌ రెసిడెన్సీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీనియర్‌ రెసిడెన్సీ పోస్టుల నియామకాల్లో ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థులను అనుమతించకపోవడంపై డాక్టర్‌ ఎం.రaాన్సీరాణి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. పిటిషనర్‌ తరపున లాయర్‌ జడ శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన డాక్టర్లను మాత్రమే అనుమతించడం డెంటర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డిసీఐ) నిబంధనలను విరుద్ధమన్నారు. దీనికి సంబంధించిన పత్రాలను న్యాయవాది కోర్టుకు అందించారు.  జడ శ్రవణ్‌ కుమార్‌ వాదానలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ, దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.