"హైవే" సినిమాను 19 ఆగష్టు న విడుదల చేయనున్న "ఆహా"

"హైవే" సినిమాను 19 ఆగష్టు న విడుదల చేయనున్న "ఆహా"

సరికొత్త కథలకు ఆహా పెట్టింది పేరు. 100 % ఓ టి టి ప్లాట్ ఫామ్. ప్రేక్షకులని ఎలా అలరించాలో, మురిపించాలో తెలిసిన మన ఆహ ఈసారి మరో కొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గుహన్ దర్శకత్వంలో వస్తున్న "హైవే" సినిమాను ఆగష్టు 19 న విడుదల చేయనుంది. ఈ సినిమా పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది.

కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ 'డి' అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని ఇన్స్పెక్టర్ ఆశ భారత్ (సయామీ ఖేర్) సహాయంతో కాపాడుకోగల్గుతాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా టీజర్ ను ఆహ ఆగష్టు 9 న ఆవిష్కరించింది.

దర్శకుడు కే. వి. గుహన్ మాట్లాడుతూ, “కోవిడ్ మొదటి వేవ్ తర్వాత, చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. అదే సమయంలో, భాషతో సంబంధం లేకుండా అందరూ ఎన్నో రకాల కంటెంట్‌తో కనెక్ట్ అయ్యారు. అప్పుడే నేను హైవే కథ తోటి  ఆనంద్ మరియు అభిషేక్ లను కలిసాను. ప్రయోగాత్మకమైన కథలను ఎప్పుడూ ప్రోత్సహించే వారిరువురు కూడా ఈ కథకు వారి అంగీకారం తెలిపారు. ఈ కథలోకి ప్రవేశించే కొద్దీ, విభిన్న షేడ్స్‌లో ఉన్న పాత్రలు, ప్రతి మలుపు సరికొత్త ఉండబోతుంది. ఆహ నుండి ఈ హైవే కోసం నాకు మంచి సపోర్ట్ లభించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.”

అంతే కాకుండా ఆహ 4కే అల్ట్రా హెచ్ డి, మరియు డాల్బీ ఆడియో తో తెలుగు మరియు తమిళ్ అభిమానులని అలరించడానికి ఆహ గోల్డ్ ఆఫర్ తో సిద్ధమవుతుంది. హైవే సినిమాను ఆనంద్ దేవరకొండ అభిమానులు 4 కే అల్ట్రా హెచ్ డి లో చూస్తూ, అలాగే డాల్బీ ఆడియో లో వింటూ, ఎన్నడూ చూడని వినోదాన్ని తెలుగు లో పొందవచ్చు.

ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ ఆగష్టు 19 న, హైవే సినిమాను తప్పక వీక్షించండి మీ ఆహ లో!

 

Tags :