ఏవీఎన్ రెడ్డి గెలుపు.. చారిత్రాత్మక విజయం : అమిత్ షా

ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డి, ఆయన గెలుపు కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయమే తెలియజేస్తోందని పేర్కొన్నారు.
Tags :