MKOne TeluguTimes-Youtube-Channel

టాలీవుడ్ ని టార్గెట్ చేసిన హనీ రోజ్...

టాలీవుడ్ ని టార్గెట్ చేసిన హనీ రోజ్...

ప్రెజెంట్ ఎవరి నోట విన్నా హనీ రోజ్ పేరే వినిపిస్తుంది. రీసెంట్ గా రిలీజైన వీరసింహారెడ్డి సినిమాలో డబల్ యాక్షన్ చేసిన బాలయ్య బాబుకి మరదలుగా, తల్లిగా తన నట విశ్వరూపం చూపించింది. రెండు పాత్రల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నపటికీ ఎక్కడా తొణక్కుండా చాలా బాగా ప్రేక్షకులని మెప్పించింది ఈ అమ్మడు. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి హనీ రోజ్. ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ని ప్లాన్ చేసుకోవడానికి రెడీ అవుతుంది.

అసలైతే అఖండ సినిమాలో బాలయ్య సరసన హనీ రోజ్ హీరోయిన్ గా నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ప్రగ్య జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. హానీలో నటనా ప్రతిభని గుర్తించిన మైత్రి మేకర్స్, గోపిచంద్ మలినేనిలు తనను బాలయ్య పక్కన జోడిగా ఫిక్స్ చేశారు. ఈ విషయంలో మేకర్స్ వేసిన అంచనా నిజమైంది. శృతి హాసన్ కన్నా హనీ రోజ్ కే ఎక్కువ గుర్తింపు లభించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో తన కెరీర్ ని డిజైన్ చేసుకుంటుంది. యూత్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా హనీని హీరోయిన్ గా తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. చాలా మంది సీనియర్ హీరోలకి జోడి వెతుక్కునే సమయంలో హనీ రోజ్ ఇపుడు నిర్మాతలకి, దర్శకులకి బెటర్ ఆప్షన్ గా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. సీనియర్ హీరోల సరసన జత కడుతూ ఇక ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.

 

 

Tags :