భారత్‌తో  సహా ఎనిమిది దేశాలపై...

భారత్‌తో  సహా ఎనిమిది దేశాలపై...

భారత్‌తో  సహా ఎనిమిది దేశాల విమానాలపై హంగ్‌కాంగ్‌ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నిరోధక  చర్యల్లో భాగంగా హంగ్‌కాంగ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌, అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌, పాకిస్థాన్‌, ఫిలిఫీన్స్‌ ప్రయాణికుల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే స్థానికంగా నూతన కరోనా నిబంధనలను ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. రాత్రి 6 తరువాత రెస్టారెంట్లలో భోజనం చేయడాన్ని నిషేధించారు. జిమ్ములు, బార్లుకు అనుమతి నిరాకరించారు.

 

Tags :