డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు

డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు

అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణం స్వీకారం సందర్భంగా పార్లమెంట్‌పై రిపబ్లికన్‌ పార్టీ కార్యకర్తల దాడి కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై నేరాభియోగాలు మోపాలని న్యాయశాఖకు సంబంధిత కమిటీ సూచనలు చేసింది. రెండోదఫా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ట్రంప్‌ తన పార్టీ అనుచరులు, మద్దతుదారులను ఉద్దేశపూర్వకంగానే 2021లో పార్లమెంట్‌ భవనం, కేపిటల్‌ హిల్‌పైకి ఉసిగొల్పారని పేర్కొంటు సుదీర్ఘ తుది నివేదికను పార్లమెంట్‌ జనవరి 6 కమిటీ విడుదల చేసింది. ఈ నివేదిక 9-0 ఓటింగ్‌తో నెగ్గించదని కమిటీ చైర్మన్‌ బెన్నీ థాంప్సన్‌ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అమల్లోకి రాకూడదనే ప్రణాళికలో పార్లమెంట్‌పై వేలాది మంది కార్యకర్తల దాడికి ప్రధానా కారకుడు ట్రంప్‌,  అధ్యక్షుడి ప్రమాణం అడ్డుకోవడం, ప్రభుత్వాన్ని మోసం చేయడం, తప్పుడు ప్రకటనలు, పార్లమెంట్‌పై దాడికి స్వయంగా కార్యకర్తలను ఉసిగొల్పడంపై అభియోగాలు మోపండి అని సూచించింది. అమెరికాలో చరిత్రలో అధికార బదిలీని అడ్డుకున్న ఏకైక అధ్యక్షుడు ట్రంప్‌ అంటూ తప్పుబట్టింది.

 

 

Tags :