అల్ జవహరీకి అది అలవాటు.. దాన్ని గుర్తించే

అల్ జవహరీకి అది అలవాటు.. దాన్ని గుర్తించే

కాబూల్‌లో అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) గుర్తించి చాకచక్యంగా మట్టుబెట్టిన తీరుకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయమొకటి బయటికొచ్చింది. బాల్కనీలో ఒంటరిగా ఉండి పుస్తకాలు చదువుకునే అలవాటే అతడి కొంపముంచినట్లు తెలిసింది. అమెరికా అధికార వర్గాల సమాచారం ప్రకారం.. అల్‌ జవహరీ కాబుల్‌లోని ఓ నివాసం ఉంటున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అక్కడ అతడి కదలికలపై సీఐఏ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసింది. అల్‌ ఖైదా అధినేత జీవనశైలిని విశ్లేషకులు నిరంతరం నిశితంగా గమనించారు. అతడి అలవాట్లపై కన్నేశారు. తాజా గాలి కోసం ఆల్‌ జవహరీ తరచూ బాల్కనీలోకి వచ్చి ఎక్కువ సేపు గడుపుతుండటాన్ని గుర్తించారు. ఉదయాన్నే బ్కాలనీలో ఒంటరిగా ఉండి చదువుకునే అలవాటునూ పసిగట్టారు. అల్‌ ఖైదా అధినేతను మాత్రమే లక్ష్యంగా చేసుకొని హతమార్చేందుకు దాన్ని మంచి అదునుగా నిర్ధారించుకున్నారు. ఆ ప్రణాళికతోనే ముదుకెళ్లి డ్రోన్‌ సాయంతో క్షిపణుల దాడి ద్వారా మట్టుబెట్టారు.

 

Tags :