ఆర్థికసాయం కోసమే.. పాకిస్థాన్ ఆచూకీ?

ఆర్థికసాయం కోసమే.. పాకిస్థాన్ ఆచూకీ?

అల్‌ ఖైదా అగ్రనేత అల్‌ జవహరీ ఆచూకి గురించి అమెరికా బలగాలకు పాకిస్థానే ఉప్పందించి ఉంటుందని బలంగా వినిపిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అగ్ర రాజ్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు జవహరీ వివరాలను సీఐఏకు పాక్‌ ఇచ్చి ఉంటుందని తెలుస్తోంది. జవహరీ ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌ నుంచి అఫ్గాన్‌కు మకాం మర్చాడు. ఇంటి బాల్కనీలో నిల్చొనే  అలవాటు ఉగ్రనేతలకు ఉందనీ, ఆ సమయంలో అక్కడ ఉన్నది కచ్చితంగా అతడేనని తేల్చి చెప్పడంలో పాక్‌ హస్తం ఉందని భావిస్తున్నారు. ఆల్‌ ఖైదా మళ్లీ అఫ్గాన్‌లో వేళ్లూనుకోరాదని భావిస్తున్నవారు, లేదా తాలిబన్లలోనే ఒక వర్గం ఈ పని చేసి ఉండవచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు.

 

Tags :