హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్‌ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు గడువుంది. నామినేషన్ల పరిశీలనకు ఈనెల 11, ఉపసంహరణకు 18వ తేదీ వరకు సమయం ఉంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిరచనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది.

 

Tags :