హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఉచితంగా

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఉచితంగా

తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయగ్నస్టిక్స్‌ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు హైదరాబాద్‌ నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండటం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పరు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151  పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు.

 

Tags :