ఇండస్ట్రియల్ ఇంజినీర్స్ సదస్సుకు.. ఆసియా ప్రతినిధిగా డాక్టర్ అల్లూరికి ఆహ్వానం

ఇండస్ట్రియల్ ఇంజినీర్స్ సదస్సుకు.. ఆసియా ప్రతినిధిగా డాక్టర్ అల్లూరికి ఆహ్వానం

అమెరికాలోని సీటెల్‌ నగరంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్స్‌ వార్షిక సదస్సులో ప్యానెల్‌ సభ్యుడిగా వ్యవహరించడానికి ఆసియా ప్రాంతం నుంచి హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ అల్లూరి వి.వి.ప్రసాద్‌ రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు కౌన్సిల్‌ చైర్మన్‌ డేవిడ్‌ పొయిరియర్‌ నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో 83 దేశాల నుంచి 385 మంది ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ మేధావులు  సమర్పించే పత్రాలపై చర్చలు జరుగతాయి. హైదరాబాద్‌లోని హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థకు డాక్టర్‌ అల్లూరి వైఎస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు 45 ఏండ్లుగా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌లో విశేష అనుభవం ఉంది.

 

Tags :