అమెరికా సంస్థ చేతికి.. స్టార్టప్ ఆటోమెట్ డాట్

అమెరికా సంస్థ చేతికి.. స్టార్టప్ ఆటోమెట్ డాట్

హైదరాబాద్‍కు చెందిన స్టార్టప్‍ ఆటోమెట్‍ డాట్‍ను అమెరికాకు చెందిన సంస్థ నోషన్‍ సొంతం చేసుకుంది. ఐదేళ్ల క్రితం నగరం కేంద్రంగా ప్రారంభమైన ఆటోమెట్‍ స్టార్టప్‍ వర్క్ప్లో ప్రాసెస్‍లో మంచి పనితీరు కనబరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగింది. 2016 నుంచి ఆటోమెట్‍ కంపెనీ ప్రారంభమై ఇప్పటి వరకు 40 వేల వ్యాపార సంస్థలతో కలిసి పనిచేస్తున్నదని స్టార్టప్‍ సీఈవో అశోక్‍ గుడిబండ్ల తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆటోమెట్‍ను 40 మంది ఐటీ నిపుణుల బృందం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‍కు చెందిన స్టార్టప్‍ను అమెరికాకు చెందిన నోషన్‍ కంపెనీ కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ అమెరికా తర్వాత హైదరాబాద్‍లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్‍ ఆటోమెట్‍ స్టార్టప్‍ కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్‍ చేశారు. హైదరాబాద్‍లో అతి పెద్ద ఇంజనీరింగ్‍ సెంటర్‍ను ఏర్పాటు చేసిన నోషన్‍ కంపెనీకి స్వాగతం పలికారు.

 

Tags :