మంత్రి కావాలని ఆశ లేదు.. ఉంటే ఒక్క రోజైనా సీఎం

మంత్రి కావాలని ఆశ లేదు.. ఉంటే ఒక్క రోజైనా సీఎం

కర్ణాటక మాజీ మంత్రి, గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌ రెడ్డి నేను మనుసు పెడితే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి అవుతాను అని వ్యాఖ్యానించారు. ఆయన సోదరుడు గాలి సోమశేఖర్‌ రెడ్డి 57వ పుట్టిన రోజు వేడుకలు బళ్లారిలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి గాలి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదు. నాకు శాసనసభ్యుడు, మంత్రి కావాలని ఆశ లేదు. ఉంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి అవుతాను అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు.  నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు చేసినట్టు సీబీఐ అధికారులే చెప్పారు అని తెలిపారు.

 

Tags :