మల్లారెడ్డి విద్యాసంస్థల గుట్టురట్టు.. ఆధారాలు సేకరించామన్న అధికారులు

మల్లారెడ్డి విద్యాసంస్థల గుట్టురట్టు.. ఆధారాలు సేకరించామన్న అధికారులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై  మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 ఐటీ టీంలు ఈ సోదాలు నిర్వహించాయి. అయితే తాజాగా ఈ సోదాలపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశిత ఫీజు కంటే అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నట్లు తేలిందని, అదనపు ఫీజును కేవలం నగదు రూపంలోనే తీసుకున్నట్లు ఆధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ అదనపు ఫీజులను స్థిరాస్తి, పెట్టుబడులతో పాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదును, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి 400 పైగా ఐటీ అధికారులతో కూడిన 65 బృందాలు పాల్గొన్నాయి. ఇప్పటివరకు కొన్ని చోట్ల మాత్రమే ముగిశాయని, మరికొన్ని ప్రదేశాల్లో బుధవారం రాత్రికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.