నెల్లూరులో నాకు అలాంటి సమస్యే : శ్రీధర్ రెడ్డి

నెల్లూరులో నాకు అలాంటి సమస్యే  : శ్రీధర్ రెడ్డి

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకు ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. బాలినేని మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జి, పార్టీలో కీలక నేత అన్నారు. బాలినేనికి స్థానిక నాయకులు అండగా ఉండాలిగానీ సమస్యగా మారకూడదన్నారు. ఆయన ఆవేదన చాలా బాధ కలిగించింది. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు ఎవరూ ప్రవర్తించకూడదు. నెల్లూరులో నేను అలాంటి సమస్యే ఎదుర్కొంటున్నాను. కొంత మంది పార్టీ ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో మరోసారి ఎలా గెలవాలో ఆలోచించకుండా ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదన్నారు.

 

Tags :