కెసీఅర్ గారు అవకాశం ఇస్తే వచ్చె ఎలక్షన్ లో పోటి చేస్తాను - జలగం సుధీర్

కెసీఅర్ గారు అవకాశం ఇస్తే వచ్చె ఎలక్షన్ లో పోటి చేస్తాను - జలగం సుధీర్

గత కొన్ని రోజులుగా అనేకమంది పాత్రికేయ మిత్రులు కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుండటం తో ఈ పత్రిక ప్రకటన విడుదల చేయటం జరుగుతుంది.  2001 నుండి TRS పార్టి లో సామాన్య కార్యకర్తగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ఉద్యమం లో పనిచేసి పోలిస్ స్టేషన్ ల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తెలంగాణ సాధన కోసం మా నేత్రుత్వం లోని తెలంగాణ ఐటి ఫోరం హైటెక్ సిటి వద్ద ధర్నాలు, ఇతర ప్రాంతాల్లో వంటావార్పు, మానవహారం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం తో పాటు దేశం లోని ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచం లోని అనేక దేశాల్లో సభలు సమావేశాలు ఎర్పాటు చేసి నాటి తెలంగాణ ఆకాంక్షను తెలియచేసినం. 

2014 లో తెలంగాణ సాదించాక 2016 లో ఇండియా కు తిరిగివచ్చి ఇష్యు బేస్డ్ పాలిటిక్స్ అనె అంశం తీసుకొని సుమారు 100 అంశాల మీద పనిచేయటం జరిగింది. ఎమర్జెన్సి దవఖాన, చెరువు కబ్జాలపై పోరాటం, మిని లైబ్రరి లు, మొబైల్ షీ టాయిలెట్ లు, ఫ్లోరొసిస్ బాధితుల సంక్షేమం, కొన్ని పాఠశాలల అభివ్రుద్ది, మెడికల్ కిట్స్ పంపిణి, అమెరికాలో ప్రాచుర్యం పొందిన టీ విత్ హెడ్మాస్టర్ కార్యక్రమం ఇక్కడ అమలు, యువత ఉపాధి కోసం డ్రై పోర్ట్ కోసం ఆలోచనలు, టూరిజం మరియు ఫిల్మ్ అభివ్రుద్ది కోసం ప్రణాలికలు, సుమారు 5000 ఆర్టిఐ అప్లికేషన్ లతో అనేక శాఖల్లో పనితీరుపై చర్చలు పెట్టడం, మొదటి గంట లో అందే గోల్డెన్ అవర్ ట్రీట్ మెంట్ కోసం ప్రయత్నాలు, రైతులకు పాము కాటు నుండి రక్షించే టెక్నాలజి కోసం క్రుషి, డయల్ 100 మీద కార్యక్రమాలు, మానసిక వికలాంగుల పాఠశాల్లో వసతులు, స్వచ్చ తెలంగాణ లో బాగంగా మూత్రం నుండి విద్యుత్ ఉత్పత్తి టెక్నాలజి లాంటి ఆలోచనలు, విద్యా మరియు వైద్య రంగం లో మార్పుల మీద అవగాహన కార్యక్రమాలు  చేస్తు కోదాడ ప్రాంత ప్రజల మధ్యనే ఉండటం జరుగుతుంది.   

2018 ఎలక్షన్ లలో పార్టి టికెట్ ఆశించి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయగా పార్టి వర్కింగ్ ప్రసిడెంట్ కెటీఅర్ సూచన మేరకు నామినేషన్ వెనక్కి తీసుకోవటం జరిగింది. 2019 నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేయటానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయగా పార్టిలో లేదా ఇంకేదైన సముచిత స్థానం కల్పిస్తామని కెటీఅర్ గారు హామి ఇచ్చారు.పార్టి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను సామాన్యుడుకి, ముఖ్యంగా విద్యావంతుల దగ్గరకు టెక్నాలజి సహయం తో చేర్చటం లో నా పరిదిలో క్రుషి చేయటం జరిగింది.  

కోదాడ లో పార్టి గ్రూపులతో సంబందం లేకుండా కేవలం కెసీఅర్ గారు నాయకత్వం మీద పూర్తి విశ్వాసం తో ఉన్నాను.2023 లో జరిగే ఎన్నికల్లో కెసీఅర్ గారు అవకాశం ఇస్తే  కోదాడ అసెంబ్లి నుండి గాని లేదా నల్లగొండ పార్లమెంట్ నుండి గాని పోటి చేయటానికి సిద్దంగా ఉన్నాను అని మీ ద్రుష్టికి తీసుకువస్తున్నాను.

అనేక అంశాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం తాపత్రయపడుతున్న ప్రతి జర్నలిస్ట్ మిత్రుడికి ధన్యవాదములు. 

(-జలగం సుధీర్)

 

 

Tags :