ప్రకాష్‌రాజ్ 10కోట్లు తెస్తే.. నేను 11కోట్లు తెస్తా : బండ్ల గ‌ణేశ్‌

ప్రకాష్‌రాజ్ 10కోట్లు తెస్తే.. నేను 11కోట్లు తెస్తా : బండ్ల గ‌ణేశ్‌

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ ‘మా’ ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో ఉన్న ఆయ‌న, జీవితా రాజ‌శేఖ‌ర్ ఎంట్రీ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఆదివారం ‘మా’ స‌భ్యుల‌తో జె.ఆర్‌.సిలో ప్ర‌కాశ్‌రాజ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్‌కు దాదాపు వంద మంది స‌భ్యుల పైగా పాల్గొన్నట్లు స‌మాచారం. ఇలాంటి క‌రోనా ప‌రిస్థితులు విందులు, స‌న్మానాలు ఏర్పాటు చేయ‌డం మంచిది కాద‌ని చెప్పిన బండ్ల‌, ‘మా’ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంపై మ‌రింత క్లారిటీని ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్నిక‌ల్లో 26 మంది పోటీ చేస్తారు. 25 ఓట్లు ఎవ‌రికైనా వేసుకోండి. కానీ ఓ మాత్రం త‌న‌కే వేయాల‌ని అంటున్నాడు బండ్ల గ‌ణేశ్‌. మీకు ఎందుకు ఓటేయాల‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నిస్తే.. ఇత‌రుల‌కు ఎందుకు ఓటు వేస్తున్నారో అందుకే త‌న‌కు ఓటేయాల‌ని చెప్పిన బండ్ల గ‌ణేశ్‌. ప్ర‌కాశ్‌రాజ్‌కు తెలుగుతో స‌హా ఇత‌ర భాష‌ల్లో న‌టుడిగా మంచి పేరుంది. ఆయ‌న ప‌దికోట్ల రూపాయ‌ల కార్ప‌స్ ఫండ్‌ను ఇస్తే.. నేను రూ.11 కోట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇత‌ర భాష‌లతో సంబంధం లేకుండానే ఆ మొత్తాన్ని తాను తీసుకు వ‌స్తాన‌నడం కొస మెరుపు. ప్రకాశ్‌రాజ్‌ను అన్న అని సంబోధిస్తూనే.. బండ్ల గ‌ణేశ్ ఇలా మాట్లాడం కొస మెరుపు.

ఝాన్సీల‌క్ష్మీబాయ్‌, మ‌దర్ థెరిస్సా, జీవిత గురించి మాట్లాడే స్థాయి త‌న‌ది కాద‌ని ఈ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి బండ్ల గ‌ణేశ్ జీవిత‌ను టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మాట‌ల సంద‌ర్భంలో చిరంజీవి గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు, ఇప్పుడు గ‌ర్భ‌గుడిలో దేవుడిలా అంద‌రికీ అండ‌గా నిల‌బ‌డుతున్న చిరంజీవి గురించి ప్ర‌స్తావ‌న ఇక్క‌డ వ‌ద్ద‌ని బండ్ల‌గ‌ణేశ్ తెలిపారు. చిరంజీవిగారి స్టార్ట్ చేసిన క‌రోనా క్రైసిన్ ఛారిటీ స‌హా తాను చేసిన గుప్త దానాల గురించి తాను చెప్పుకోన‌ని అన్నారు బండ్ల గ‌ణేశ్‌.

 

Tags :