ఇళయరాజా సంగీత విభావరి

ఇళయరాజా సంగీత విభావరి

సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియనివారు లేరు... సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని ఆయన. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు, మేస్ట్రో ’ఇళయరాజా’.

ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్‌. 1943, జూన్‌ 2లో తమిళనాడులోని తేని జిల్లాలో పన్నియ పురంలో జన్మించారు. రామస్వామి, చిన్నతాయమ్మాల్‌ దంపతులకు మూడో కుమారుడిగా జన్మించిన ఇళయరాజా ఇప్పటివరకు వేయికిపైగా  సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు ఆయన సంగీతాన్ని సమకూర్చారు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు లను ఆయన అందుకున్నారు. పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు  సంగీత కచేరీల ద్వారా ఎంతోమంది విని ఆనందించారు. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత ‘‘బుడాపెస్ట్‌ సింఫనీ ఆర్కెస్ట్రా’’ని వాడేవారు. 1993 న లండన్‌ లోని ప్రఖ్యాత రాయల్‌ ఫిల్హర్మోనిక్‌ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి ‘‘సింఫనీ’’ని కంపోస్‌ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు.  ‘మేస్ట్రోగా ఎంతోమంది ఆయనను పిలుస్తారు. ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు.

ఆటా మహాసభల్లో జూలై 3వ తేదీన జరిగే ముగింపు వేడుకల్లో ఇళయరాజా తన సంగీత విభావరితో శ్రోతలను ఆనందింపజేయనున్నారు.

 

Tags :