ఈ ప్రయోగం తెలంగాణలో సక్కెస్ అయితే.. దేశమంతటా

ఈ ప్రయోగం తెలంగాణలో సక్కెస్ అయితే.. దేశమంతటా

కరోనా మహమ్మారిని అంతమొందించటానికి పలు చర్యలు తీసుకున్న తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్‍ చేయటానికి రెడీ అయ్యింది. అదే కరోనా వ్యాక్సిన్‍ డెలివరీ చేయటానికి టెక్నాలజీని ఉపయోగించనుంది. కరోనా వ్యాక్సినేషన్‍ పక్రియ నగరాల్లో బాగానే జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‍ వేగంగా చేయటానికి డ్రోన్లతో వ్యాక్సిన్లను తరలించేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రయోగం తెలంగాణలో సక్సెస్‍ అయితే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. మెడిసిన్‍ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్‍ తరలింపే లక్ష్యంగా మెడిసిన్‍ ఫ్రం ది స్కై ప్రాజెక్టు లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్‍ జరుగుతోంది. ఇది ఎక్కువ శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతోంది. కానీ మారుమూల ప్రాంతాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు వ్యాక్సినేషన్‍ అందటం లేదు. దీనికి కారణం అక్కడకు వెళ్లే దారులు కష్టంగా ఉండటం ఒక్కటే కాదు. వ్యాక్సిన్లు సరైన ఉష్ణోగ్రతల్లో ఉండాలి. అలా ఉంటేనే అవి పాడైపోకుండా ఉంటాయి.  కానీ అంటవీ ప్రాంతాలకు చేరుకునే క్రమంలో జరిగే సమయాభావంతో వ్యాక్సిన్లు పాడైపోయే అవకాశముంది. వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగత్రల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంత వ్యాక్సిన్లు వేసే రోజునే గ్రామీణ ప్రాంతాలకు  వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లిన వెంటనే వేయాల్సి వస్తోంది. కానీ అన్ని గ్రామాలకు ఇటువంటి అవకాశం లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లే  సమయాభావం వల్ల వ్యాక్సిన్లు పాడైపోయే ప్రమాదముంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసన్‍ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు.

 

Tags :