MKOne Telugu Times Youtube Channel

హైదరాబాద్ లో పెరిగిన గృహాల అమ్మకాలు

హైదరాబాద్ లో పెరిగిన గృహాల అమ్మకాలు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఇళ్ళ అమ్మకాలు జోరందుకున్నాయి. లాంచింగ్‌ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. గత సంవత్సరం హైదరాబాద్‌ నగరంలో 25,410 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 55 శాతం ఇళ్లు కొత్తగా ప్రారంభమైనవే. తుది గృహ కొనుగోలుదారులతో పాటు పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడమే లాంచింగ్‌ ప్రాజెక్ట్స్‌లో విక్రయాల వృద్ధికి కారణమని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గతేడాది 2.37 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 34 శాతం కొత్తగా ప్రారంభమైన ఇళ్లే. 2020లో ఈ తరహా గణాంకాలు పరిశీలిస్తే.. 1.38 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 28 శాతంగా ఉంది. అలాగే 2019లో 2.61 లక్షల ఇళ్లు విక్రయం కాగా.. వీటి వాటా 26 శాతంగా ఉంది. ఈ తరహా విక్రయాలు అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. గతేడాది నగరంలో 25,410 యూనిట్లు సేల్‌ కాగా.. 55 శాతం కొత్త గృహాలే అమ్ముడుపోయాయి. అలాగే 2019లో 16,590 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 28 శాతంగా ఉంది. అత్యల్పంగా ముంబైలో 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. 

3-4 ఏళ్లలో నివాస సముదాయాలలో పెట్టుబడుల నుంచి నిష్క్రమించిన ఇన్వెస్టర్లు.. వాణిజ్యం, రిటైల్‌, గిడ్డంగుల వంటి ఇతర విభాగాలలో పెట్టుబడు లపై దృష్టి సారించారు. వారంతా తిరిగి రెసిడెన్షి యల్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై ఫోకస్‌ పెట్టారు. ఇదే సమయంలో లిస్టెడ్‌, బ్రాండెడ్‌ డెవలపర్లు భారీ స్థాయిలో రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభి స్తున్నారు. దీంతో గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2.37 లక్షల యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. గడువులోగా నిర్మాణం పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు.   ముంబైలో 76,400 గృహాలు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. చెన్నైలో 12,530 గృహాలు సేలవగా లాంచింగ్‌ యూనిట్ల వాటా 34 శాతం, బెంగళూరులో 33,080 యూనిట్లు విక్రయం కాగా.. కొత్త ఇళ్ల వాటా 35 శాతం, పుణేలో 35,980 ఇళ్లు అమ్ముడు పోగా.. లాంచింగ్‌ యూనిట్ల విక్రయాల వాటా 39 శాతంగా ఉంది.

 

Tags :