డల్లాస్‍లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

డల్లాస్‍లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

డల్లాస్‍లో మహాత్మాగాంధీ మెమోరియల్‍ ఆఫ్‍ నార్త్ టెక్సాస్‍ ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్‍ వద్ద 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్‍ నిబంధనల్ని పాటిస్తూ ప్రవాస భారతీయులు ఈ వేడుకలు జరుపుకొన్నారు. భారత జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీ మెమోరియల్‍ ఆఫ్‍ నార్త్ టెక్సాస్‍ వ్యవస్థాపక ఛైర్మన్‍ డా. ప్రసాద్‍ తోటకూర ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ సహా ఎంతోమంది జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న 75ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా, ఇప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో తాగునీరు, విద్యుత్‍, విద్య, వైద్యం వంటి కనీస వసతులు లేకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా ప్రసాద్‍ తోటకూర అన్నారు. పాలకులు చిత్తశుద్ధితో, ప్రజలు అంకితభావంతో కలిసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివ•ద్ధి సాధించలేమన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు మన దేశాభివ•ద్ధిలో తమ వంతు క•షితో పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Tags :