భారత్ సరికొత్త రికార్డు ... ప్రధాని జన్మదిన కానుకగా

భారత్ సరికొత్త రికార్డు ... ప్రధాని జన్మదిన కానుకగా

ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో ఒక్క రోజులో ప్రజలకు రెండున్నర కోట్లకు పైగా టీకా డోసులు అందించారు. కొవిన్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2. 5 కోట్లు దాటింది. ఒక రోజులో కోటికి పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించడం గత 22 రోజుల్లో ఇది నాలుగో సారి. ఇంతవరకు ఆసగ్టు 27, 31, సెప్టెంబరు 6 తేదీల్లో కోటికి పైగా డోసులు వేశారు.  దేశంలో ప్రజలకు ఇంతవరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 79.33 కోట్లు దాటడం విశేషం. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 

Tags :