డిజిటల్ సదుపాయాలతో దేశంలో 40 శాతం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి

డిజిటల్ సదుపాయాలతో దేశంలో 40 శాతం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి

దేశంలో సుమారు 40 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా మెరుగయ్యాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి అన్నారు. బుధవారం నాడు బెంగళూరులో బుధవారం నిర్వహించిన 'ఇండియా అడ్వాంటేజ్’ ఆరో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ది, బ్యాంకులు, నగర సాంకేతికత, స్టార్టప్ పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా ఈ అంశాలపై జరిగిన పరిశోధనలు ఇప్పుడు మంచి ఫలితాలను అందిస్తున్నాయన్నారు. మొదట అమెరికా అభివృద్ధి చేసిన జీపీఏ వ్యవస్థను.. ప్రస్తుతం మన దేశంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. దేశంలో ప్రతిరోజూ 50 లక్షలకుపైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. సుమారు 12 కోట్ల మంది డిజిటల్ లాకర్లలో తమ డబ్బును దాచుకుంటున్నారని తెలిపారు. యూపీఐ, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు చక్కని ఆదరణ లభిస్తున్నట్లు వివరించారు. నగదు, రుణాల బదిలీతో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు సృష్టించడం మరింత వేగంగా జరుగుతుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఆర్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అంజుం పర్వేజ్, ఇజ్రాయిల్ రాయబారి బమ్మి బెన్ హైమ్, జర్మన్ రాయబారి అచిమ్ బుర్కార్ట్, టీఐఏ క్యూరేటర్ జోస్ జాకోబ్, భారతీయ ఆర్థిక అభివృద్ధి మండలి ప్రతినిధి రాజు చింతల, కర్ణాటక డిజిటల్ ఆర్థిక అభివృద్ధి అభియాన్ అధ్యక్షుడు బి.వి. నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :