భారత్ కు ఎస్-400 : రష్యా

భారత్ కు ఎస్-400 : రష్యా

భారత్‌కు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల అందజేత ప్రక్రియ ప్రారంభమైందని రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అనుకున్న ప్రకారమే సమయానికి డెలివరీ మొదలుపెట్టామని ఫెడరల్‌ సర్వీస్‌ మిలిటరీ టెక్నికల్‌ కో ఆపరేషన్‌ (ఎఫ్‌ఎస్‌ఎంటీసీ) దిమిత్రి షుగేవ్‌ అన్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థలు చైనా, టర్కీలో సేవల్లో చేరాయని తెలిపారు. దుబాయ్‌ ఎయిర్‌షోకి ముందు  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మధ్య ప్రాచ్యం, ఏషియా పసిఫిక్‌ ఆఫ్రికాలో మరో ఏడు దేశాలతో ఈ క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

ఐదు ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌, రష్యా మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం 2018 అక్టోబరులో కుదిరింది. అయితే దీనిపై అమెరికా తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కొంతకాలంగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మన వైఖరిని అమెరికాకు ఇప్పటికే స్పష్టం చేశారు.  మరోవైపు ప్రాంతీయ భద్రత, రక్షణ అవసరాల రీత్యా భారత్‌కు ఎస్‌ 400 విషయంలో ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ అక్కడి కీలక సెనేటర్లు అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే క్షిపణి వ్యవస్థల అందజేత ప్రక్రియ ప్రారంభమైందని రష్యా నుంచి ప్రకటన రావడం గమనార్హం.

 

Tags :