భారత్-ఆస్ట్రేలియా మధ్య ఎఫ్టీఏ ఒప్పందం

భారత్, ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) డిసెంబరు 29 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపై 45-50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.7-4.1 లక్షల కోట్ల) కు చేరే అవకాశం ఉందని అంచనా. ఆస్ట్రేలియా`భారత్ ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) అమలుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను భారత ప్రభుత్వం పూర్తి చేసిందని, దీంతో ఎఫ్టీఏ అమలుకు మార్గం సుగమనైనట్లు ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు కొత్త శకానికి నాందిగా భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అభివర్ణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
Tags :