భారత్, చైనా మధ్య చర్చలు

భారత్, చైనా మధ్య చర్చలు

భారత్‌, చైనాల మధ్య 14వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో బలగాల ఉపసంహరణ కోసం భారత్‌ గట్టిగా వాదించగా, ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితి కొనసాగించాలని చైనా వాదించినట్లు సమాచారం. తూర్పు లఢక్‌లో 2020 మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, ఎల్‌ఎసి వెంబడి భారీగా దళాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 13 సార్లు చర్చలు జరిగాయి.  వీటి ఫలితంగా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, గోగ్రా నుంచి ఇరు పక్షాల సైన్యాలు వెనక్కి వెళ్లాయి. గతేడాది అక్టోబర్‌లో జరిగిన 13వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. భారత ఆర్మీ డే సందర్భంగా  ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే మాట్లాడుతూ ఉద్రిక్త ప్రాంతాల్లో చైనా మోహరింపులు తగ్గలేదని, పైగా అనేక రెట్లు పెరిగాయని ఆరోపించారు.

 

Tags :