కమాండర్ స్థాయి చర్చలు.. చైనాకు తెగేసి చెప్పిన భారత్

కమాండర్ స్థాయి చర్చలు.. చైనాకు తెగేసి చెప్పిన భారత్

తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్‌ మరోసారి తేల్చి చెప్పింది. భారత్‌, చైనా మధ్య 13వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సైనిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్‌`మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు భూభాగంలో ఈ చర్చలు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8:30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన  చర్చల్లో కాలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్‌ తరపు బృందానికి లేప్‌ాలోని 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.జి.కె.మీనన్‌ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్‌ హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతంలోని పెట్రో లింగ్‌ పాయింట్‌ (పీపీ) 15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటు చేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్‌ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్‌ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.

 

Tags :