MKOne TeluguTimes-Youtube-Channel

ఆ ఆరు దేశాల నుంచి భారత్ కు వస్తే.. తప్పనిసరి

ఆ ఆరు దేశాల నుంచి భారత్ కు వస్తే.. తప్పనిసరి

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. చైనా హాంగ్‌కాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయిలాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అములోకి రానున్నాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ఆ  దేశాల నుంచి వచ్చే వారు నిర్ణీత ప్రయాణ సమయానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష విధిగా చేయించుకుని, రిపోర్ట్‌తో రావలసి ఉంటుంది. ఇక విదేశాల నుంచి వచ్చే మొత్తం ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడి విమానాశ్రయాల్లో నిర్వహించే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

 

Tags :