భారత్ సిగ్గుతో తలదించుకోవాలి : అరుంధతీరాయ్

భారత్ సిగ్గుతో తలదించుకోవాలి : అరుంధతీరాయ్

ఒకప్పుడు విప్లవాత్మక ఉద్యమాలకు నాయకత్వం వహించిన దేశ నాయకులు ఓట్ల కోసం తాము అధికారంలోకి వస్తే ఐదు కిలోల రేషన్‌ బియ్యం, ఒక కిలో ఉప్పు పంపిణీ చేస్తామని చెప్పి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నారని బుకర్‌ ప్రైజ్‌ విజేత అరుంధతీరాయ్‌ అన్నారు. భారత్‌ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంది అని ఆమె వ్యాఖ్యనించారు. ఈ దేశ నాయకులు విమానంలో రివర్స్‌ ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అత్యధిక పుస్తక విక్రయాలు జరిగిన ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌ రచయిత, 62 ఏళ్ల అరుంధతీ రాయ్‌ వ్యాఖ్యానించారు. 90 శాతం పక్షపాతం వచ్చి ఏడేళ్లు జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబాను విడిపించలేని పాలకులను చూస్తుంటే దేశానికి అవమానకరమని ఆమె అన్నారు. మావోయిస్టులతో  సంబంధం ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్‌ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. వీల్‌ చైర్‌లో జైలు జీవితం గడుపుతున్నాడని ఆమె ఆవేదన చెందారు.

 

Tags :