99 దేశాల పర్యాటకులు క్వారంటైన్ లేకుండానే రావచ్చు

99 దేశాల పర్యాటకులు క్వారంటైన్ లేకుండానే రావచ్చు

భారతదేశం విదేశీ పర్యాటకులకు మునుపటి స్వాగతానికి రంగం సిద్ధం చేసింది. 99 దేశాల పర్యాటకులు భారతదేశంలోకి క్వారంటైన్‌ ఆంక్షలు లేకుండానే నేరుగా ప్రవేశించవచ్చు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పత్రాల పరస్పర గుర్తింపు జాబితాలోని దేశాల వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. దాదాపుగా 20 నెలలుగా విదేశాల నుంచి వచ్చే వారిపై పలు ఆంక్షలు అమలు అవుతూ వచ్చాయి. ఇందులో ప్రధానంగా 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా, నెదర్లాండ్స్‌ వంటి 99 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వేచ్ఛాయుత అనుమతి ఉంటుంది. ఈ దేశాల వారిని కేటగిరి ఏ పరిధిలో చేర్చారు.

 

Tags :