కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం?

జాతీయ భద్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను నిరోధించే ప్లాన్లలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం యోచన ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చైనా సహా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్ తగలనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గూఢచర్యం, వినియోగదారు డేటా దుర్వినియోగం గురించి ఆందోళన మద్య భారతదేశ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను తీసుకురానుంది. ఫిబ్రవరి 8న ప్రభుత్వ రహస్య రికార్డు ప్రకారం ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తీసివేయడానికి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడానికి అనుమతించమని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను నిలువరించాలని యోచిస్తోంది. చైనా సహా విదేశీ కంపెనీల గూఢచర్యాన్ని నిరోధించాలని భావిస్తున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారిని ఒకరు తెలిపారు.