MKOne TeluguTimes-Youtube-Channel

కొత్త సంవత్సరం కొత్త వేరియంట్.. బీ అలర్ట్

కొత్త సంవత్సరం కొత్త వేరియంట్.. బీ అలర్ట్

భారత్‌లో ఒమిక్రాన్‌ ఉపరకం ఎక్స్‌బీబీ 1.5 తొలి కేసు వెలుగుచూసింది. గుజరాత్‌లో ఇది బయటపడింది. ప్రస్తుతం అమెరికా లో కరోనా కేసులు పెరుగుదలకు ఈ సబ్‌ వేరియంటే కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్‌బీబీ 1.5 వేరియంట్‌ వల్ల గత వారం వ్యధిలోనే అమెరికాలో కేసులు 21.7 శాతం నుంచి 41 శాతం పెరిగాయిన యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసిజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. దీని కారణంగా న్యూయార్క్‌లో ఆస్పత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి.  ఎక్స్‌బిబి లక్షణాలు ముక్కు కారడం, గొంతు మంట, జ్వరం, తలనొప్పి. ఇదిలా వుండగా గత 24 గంటల్లో భారత్‌లో 243 కొత్త కరోనా వైరస్‌ సంక్రమణాలు వ్యాపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.

 

 

Tags :