'డేంజరస్' చిత్రం తో మరో సారి టీన్స్ కి గాలం వేసిన రామ్ గోపాల్ వర్మ

'డేంజరస్' చిత్రం తో మరో సారి టీన్స్ కి గాలం వేసిన రామ్ గోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీ లో తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఆర్జించే ఆలోచనలు వున్నా ఏకైక దర్శక నిర్మాత  రామ్ గోపాల్ వర్మ.  ఏ సినిమా చేసినా కాస్త కొత్తగా, అంతకుమించి బోల్డ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఎదో ఒక ప్రయోగం చేస్తూ తనకు నచ్చినట్లుగా సినిమా తీస్తా అని చెప్పే వర్మ..  తాజాగా  లెస్బియన్ క్రైమ్ డ్రామా 'డేంజరస్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ మధ్య సాగే శృంగార సన్నివేశాలను హైలైట్ చేశారు.  ఈ సారి లెస్బియన్ క్రైమ్ డ్రామాను రూపొందించే పనిలో పడ్డారు. గతంలో ''గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST), క్లైమాక్స్'' లాంటి సినిమాలతో అడల్ట్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు 'డేంజరస్' పేరుతో లెస్బియన్ క్రైమ్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం హాట్ బ్యూటీలు నైనా గంగూలీ, అప్సరా రాణిలను రంగంలోకి దించారు వర్మ. ఇండియాలో తొలి లెస్బియన్ మూవీగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అంటే గతం ఫైర్ అనే సినిమా వచ్చినా అది బోల్డ్ మూవీ కాదు.  

ఇక చిత్ర ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ తనదైన దారిలో వెళ్లే ఆయన 'డేంజరస్' ట్రైలర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి చూపు తన సినిమా వైపు తిప్పుకున్నారు. మరోవైపు ఆ ఇద్దరు డేంజరస్ భామలతో సినిమా షూటింగ్‌ సమయంలో దిగిన పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. 2 నిమిషాల 22 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో నైనా గంగూలీ, అప్సరా రాణిల రొమాన్స్ హైలైట్ చేశారు. మధ్య మధ్యలో థ్రిల్లింగ్ సన్నివేశాలు జోడిస్తూ రొమాంటిక్ థ్రిల్లర్‌కి సరైన ఉదాహరణలా తీర్చిదిద్దారు. మరి అప్సరా రాణి, నైనా గంగూలి లవ్ స్టోరీ ఏంటి? వాళ్లిద్దరూ ఎందుకు అలా మారారు? వాళ్ళు క్రైంలో ఎందుకు చిక్కుకున్నారు? వర్మ ఈ స్టోరీని ఎలా మలిచారు? అనేది ఈ సినిమా విడుదలయ్యాకే చూడాలి. తన సొంత ప్లాట్‌ఫామ్ స్పార్క్ ఓటీటీలో త్వరలో ఈ మూవీ చూడొచ్చని ఆయన తెలిపారు.

Tags :