భారత్, అమెరికా 2 ప్లస్ 2 చర్చలు

భారత్, అమెరికా 2 ప్లస్ 2 చర్చలు

భారత్‌ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉండేందుకు సిద్ధమని అమెరికా వెల్లడించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందేందుకూ, న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో ఢల్లీి చేరేందుకూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ దేశం పునరుద్ఘాటించింది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో ఒకటైన భారత్‌ గణనీయమైన పాత్ర పోషిస్తోందని కొనియాడిరది. భారత్‌, అమెరికా 2G2 మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ముగిసింది. భారత్‌ తరపున విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు పాల్గొనగా, అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లు హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అద్యక్షుడు జో బైడెన్‌లు వీడియా ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పాకిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకూడదని భారత్‌, అమెరికాలు ఆ దేశానికి విస్ఫష్టం చేశాయి. ముంబయి,  పఠాన్‌ కోట్‌ దాడుల నిందితులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

Tags :