ఈ నెల 29 నుంచి భారత్, సింగపూర్ విమాన రాకపోకలు

ఈ నెల 29 నుంచి భారత్, సింగపూర్ విమాన రాకపోకలు

భారత్‌, సింగపూర్‌ మధ్య వాణిజ్య ప్రయాణికుల విమాన రాకపోకలు పున ప్రారంభం కానున్నాయి. ఒప్పందంలో భాగంగా భారత్‌లో సింగపూర్‌ వ్యాక్సినేటెడ్‌ ట్రావెల్‌ లేన్‌ (వీటీఎల్‌) నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై, ఢిల్లీ ముంబయి నుంచి రోజు ఆరు విమానాలు నడవనున్నాయి. ఈ నెల 29 నుంచి 2022 జనవరి 21 మధ్య సింగపూర్‌ వెళ్లాలనుకొనే స్వల్పకాలిక సందర్శకులు, దీర్ఘకాలిక పాస్‌ హోల్డర్లు టీకాలు వేసుకున్న ట్రావెల్‌ పాసుల (వీటీపీ) కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అందుకు తమ పాస్‌పోర్టు, టీకా డిజిటల్‌ ధ్రువపత్రాలను సమర్పించాలి. పీసీఆర్‌ ఫలితాల కోసం నిరీక్షించే సమయంలో నివాస చిరునామాను కూడా తెలపాలి. వీసా కావాల్సిన ప్రయాణికులు వీటీపీ ఆమోదం లభించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. 30 వేల సింగపూర్‌ డాలర్ల విలువైన కొవిడ్‌ 19 బీమాను కూడా తీసుకోవాలి.

 

Tags :