74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లోకి

74 ఏళ్ల తర్వాత మళ్లీ  భారత్‌లోకి

దాదాపు 74 ఏళ్ల తర్వాత గతేడాది భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించగా ఇప్పుడు వాటి సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఫిబ్రవరి నెలలో ఈ చీతాలు భారత్‌కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య గత వారం ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఏడు  మగ, అయిదు ఆడ చీతాలను ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో ప్రత్యేక క్వారంటైనులో ఉన్నాయి. ఈ నెలలోనే అవి భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రకియ ఆలస్యమైంది అని అధికారి తెలిపారు.

 

 

Tags :