MKOne TeluguTimes-Youtube-Channel

త్వరలోనే అమెరికా నుంచి భారత్ కు ఎమ్ క్యూ-9బి ప్రిడేటర్

త్వరలోనే అమెరికా నుంచి భారత్ కు ఎమ్ క్యూ-9బి ప్రిడేటర్

సాయుధ ఎమ్‌క్యూ-9బి ప్రిడేటర్‌ డ్రోన్‌ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ అమెరికాల మధ్య ఐదేళ్లుగా చర్చల్లో నానుతున్న ఒప్పందం త్వరలో ఖరారు కానుంది. త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 30 ప్రిడేటర్‌ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌ నిర్ణయించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందానికి తుదిరూపు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ను కలిసి పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అత్యాధునిక సాంకేతికత రంగాల్లో సహకారానికి  భారత్‌ అమెరికాల మధ్య కుదిరిన ఐసీఈటీ ఒప్పందాన్ని ఇరు దేశాల సంబంధాల్లో మరో మైలురాయిగా అమెరికా  అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

 

 

Tags :